సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. అంతేకాదు పుట్టిన రోజులకు.. ఏదైనా స్పెషల్ డేస్ కి ఒకరికొకరు తమ సోషల్ మీడియాలో స్పెషల్ విషెష్ చెప్తున్నారు. దీంతో వీరిద్దరూ చెప్పకపోయినా వీరు రిలేషన్ లో ఉన్నారని అందరూ క్లారిటీతో ఉన్నారు. అయితే ఇద్దరూ కలిసి ఈవెంట్లకు వెళ్లడంతోపాటు రీల్స్ కూడా చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్, హైదరి.. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.
మరోసాని న్యూ ఇయర్ సందర్భంగా విదేశాల్లో చాలా క్లోజ్ గా దిగిన ఫొటోను షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇద్దరూ కలిసి మళ్ళీ ఫోటో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ అధికారికంగా రిలేషన్ లో ఉన్నారంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆదితిరావు హైదరిని వివాహం చేసుకోవడానికి సిద్ధార్థ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదంటే ఇలా సహజీవనంలో ఉంటారా? అనే అనుమానం కూడా అభిమానుల్లో కలుగుతోంది.

వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ రెండో పెళ్లి అవుతుంది. మేఘన నారాయణ అనే అమ్మాయిని సిద్ధార్థ్ గతంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అదితి కూడా సత్యదేవ్ మిశ్రా అనే నటుడిని మనువాడింది. తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. సిద్ధార్థ్, హైదరి.. వీరిద్దరూ మహాసముద్రం అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరిమధ్య స్నేహం చిగురు తొడిగిందని, ఆ స్నేహం సహజీవనం చేయడంకానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ కారణమవుతోందంటున్నారు.