అమాయకత్వం.. చిలిపితనంతో అడియన్స్ ఫేవరెట్ కంటెస్టెంట్‌గా పాపులారిటీని సంపాదించుకుంది. అదే సమయంలో దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లాతో షెహనాజ్ స్నేహంతో మరింత ఫేమస్ అయ్యింది. మోడలింగ్ ద్వారా కెరీర్ ఆరంభించిన షెహనాజ్.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అయితే భూమి పెడ్నేకర్, షిబానీ బేడీ, కుషా కపిలతో కలసి ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ మూవీలోనూ షెహనాజ్ గిల్ నటించారు. అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండటంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఈ టైమ్‌లో షెహనాజ్ ఆస్పత్రి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న షెహనాజ్‌ను ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ మూవీ కో-ప్రొడ్యూసర్ రియా కపూర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో షెహనాజ్‌కు ట్రీట్మెంట్ జరుగుతోందని తెలిసింది. ఆమె అస్వస్థతకు ఫుడ్ పాయిజనింగ్ కారణమట. శాండ్విచ్ తినడం వల్లే తనకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో షెహనాజ్ గిల్ తెలిపారు. తానిప్పుడు బాగానే ఉన్నానని.. ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమేరకు ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు.
ఇలాంటి టైమ్ అందరికీ ఎదురవుతుందని.. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుందన్నారీ బ్యూటీ. తన గురించి ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడొద్దని.. మరో రెండ్రోజుల్లో ఇంటికి చేరుకుంటానని షెహనాజ్ పేర్కొన్నారు. కాగా, షెహనాజ్ యాక్ట్ చేసిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ మూవీ అక్టోబర్ 6న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక, హీరోయిన్‌గానే గాక బాలీవుడ్లో సింగర్‌గానూ షెహనాజ్ రాణిస్తుండటం విశేషం. మరి.. నటి షెహనాజ్ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆస్పత్రి పాలవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Get well soon ShehnaazGill is in Hospital 🥺💔#ShehnaazGiIl #shehnaazkaurgill #Shehnaazians #ShehnaazKaurGiII #ShehnaazGallery pic.twitter.com/CKANiBIWex
— Asmakhan (@zoyakhan9948a) October 9, 2023