లేలేత అందాలతో కాక పుట్టిస్తున్న మాజీ CM మ‌న‌వ‌రాలు.

శార్వరీ వాఘ్. బాలీవుడ్ తెరపై తళుకులీనుతున్న కొత్త అందం. ప్యార్ కా పంచ్‌నామా 2, బాజీరావ్ మస్తానీ, సోనూ కె టీటూ కీ స్వీటీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్. తెరముందుకు కూడా వచ్చేసింది. బంటీ ఔర్ బబ్లీ 2తో హీరోయిన అయింది. మహారాజాలో నటిస్తోంది. అయితే శార్వరీ వాఘ్ .. న‌టి కం ఫ్యాష‌నిస్టా. ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఇప్ప‌టికే పేరు తెచ్చుకుంది. అలాగే నేటితరం ఫ్యాష‌నిస్టాల్లో శార్వారి తన ఫ్యాషన్ ఎంపికలతో హెడ్ ట‌ర్న‌ర్ గా నిలుస్తోంది.

రెడ్ కార్పెట్‌పై సొగసైన ప్రదర్శనలైనా లేదా ఎయిర్‌పోర్ట్ లుక్ లో అయినా ప్రతిసారీ షో స్టాప‌ర్ గా పరిపూర్ణతతో ఆకర్షిస్తుంది. శార్వరి వాఘ్ ఇటీవ‌ల‌ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లో మరోసారి అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకుంది. YRF బంటీ ఔర్ బబ్లీతో శర్వరీ వాఘ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఈ బ్యూటీ కొత్త బాబ్లీగా కనిపించింది. గల్లీ బాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించింది.

సూపర్ స్టార్లు రాణి ముఖర్జీ – సైఫ్ అలీ ఖాన్‌లతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. త‌న మొద‌టి సినిమా ప్రివ్యూ స‌మ‌యంలో త‌న త‌ల్లి సోద‌రి క‌న్నీళ్లు పెట్టుకున్నార‌ని, కామెడి చిత్ర‌మే అయినా వారు త‌న‌ను తొలిసారి తెర‌పై చూసి ఎమోష‌న‌ల్ అయ్యార‌ని శార్వ‌రి తెలిపింది. ఏడేళ్ల క‌ల ఫ‌లించి చివ‌రికి న‌టిని అయ్యాన‌ని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి న‌టిగా మారిన శార్వ‌రి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ నాయిక‌గా కొన‌సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *