ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్తున్నా..! నా వాళ్లే నన్ను మోసం చేసారు : షర్మిలా

వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. దీని కోసమే కాంగ్రెస్ లో చేరిక ..పార్టీ విలీనం పైన సుదీర్ఘ మంతనాలు జరిపారు. డీకే శివకుమార్ తో మొదలైన రాయబారం..తరువాత ఢిల్లీలో నేరుగా సోనియా, రాహుల్ తోనూ సమావేశమయ్యారు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని సోనియా హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం ఖాయమని అనుకుంటున్న దశలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విస్ట్ ఇచ్చారు.

లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించిన షర్మిల.. విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధాన చర్చించారు. ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు షర్మిల. విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని షర్మిల తెలిపారు.

పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. షర్మిల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఇంకా క్లారిటీ రాలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి షర్మిల.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ విలీనంపై కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. రేపో.. మాపో విలీన ప్రకటన అధికారింగా రాబోతుందనే తరుణంలో షర్మిల కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *