జగన్ ఓ నియంత.. త్వరలోనే గద్దె దింపుతానని, ఇది నా శపథం అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత కెసిఆర్ ను గద్దె దింపానని, ఏపీలోనూ నియంతను గద్దె దింపి తీరుతానని ఆమె పేర్కొన్నారు.
వైయస్సార్ ఆశయాలని అన్న ఎన్నో చెప్పారని, ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారని కానీ అవకాశం ఇచ్చిన ప్రజల కోసం ప్రత్యేక హోదా ఉద్యమం కూడా చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
నగరిలో నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే అనే వ్యాఖ్యలను 12 సార్లు చేశారు. నియంత ప్రభుత్వం అంటూ పదిసార్లు వ్యాఖ్యానించారు. వైయస్సార్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, నేడు జగన్ హయాంలో వ్యవసాయం దండగ అనేది కనిపిస్తుందని షర్మిల ఆరోపించారు.