రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. అంబానీ, అదానీ లాంటి సంపన్నుల పెళ్లిళ్లు జరిగే ఈ ప్యాలెస్‌ను.. తన కొడుకు పెళ్లి కోసం బుక్ చేశారు షర్మిల. అయితే సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. కుటుంబ పరంగా జగన్ కి, షర్మిలకు మధ్య గ్యాప్ పెరుగుతోంది.
ఈరోజు జైపూర్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరగనుంది . ఈ పెళ్లిని చూసేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే.. సొంత మేనల్లుడి వివాహానికి సీఎం జగన్ హాజరు కావడం లేదు. జనవరి 18న జరిగిన షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ కు సీఎం జగన్ కుటుంబ సమేతంగా అటెండ్ అయిన విషయం తెలిసిందే.
ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబులపై విమర్శల దాడికి దిగారు. ఏపీలో ఊసే లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరిక బలాన్ని చేకూర్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని షర్మిల జిల్లాల టూర్లు చేస్తూ.. గత ప్రభుత్వల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న తన సొంత అన్న సీఎం జగన్ ను షర్మిల వదలకుండా విమర్శలు చేస్తోంది.