షకీల తమిళనాడులోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె తన స్టార్ డమ్ తో సూపర్ స్టార్లకు షాక్ ఇచ్చారు. వారికి సమానంగా రెమ్యునరేషన్లు తీసుకున్నారు. అయితే కుటుంబ పోషణ కోసం ల్లోకి అడుగుపెట్టారు షకీలా. 18 ఏళ్లకే నటిగా మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ ల్లో సందడి చేసింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్లు తీసుకున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. షకీలా తల్లిది నెల్లూరు, తండ్రిది చెన్నై. తన ఫ్యామిలీ గురించి షకీల మాట్లాడుతూ.. 10వ తరగతి ఫెయిల్ కావడంతో తండ్రి చితకబాదాడు. ఆయన మేకప్‌మెన్ నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నాడు. అలా ఒకరోజు నేను సిల్క్ స్మితను చూశాను. నన్ను సిల్క్ స్మిత చెల్లెలిగా సెలక్ట్ చేశారు. చాలా సినిమాల్లో నన్ను దుస్తులు విప్పేయమంటున్నారు నాన్న అని చెప్తే.. చేయనని చెప్పేయ్ అని సులువుగా అనేవారు.
నాన్న చనిపోయాక హాట్ రోల్స్ చేశాను. నా డబ్బులన్నీ మా అక్క చూసుకునేది. తను బాగుపడింది. నా సినిమాకు సెన్సార్ ఇవ్వకుండా ఆపేశారు. నాలుగేళ్లు ఖాళీగా ఉన్నాను. నేను నేనుగా ఉండటమే నా బలం’ అని చెప్పుకొచ్చింది. షకీల 50 మందికి పైగా ట్రాన్స్‌జెండర్ల బాగోగులు చూసుకుంటోంది. వారిలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు స్టేజీపైకి వచ్చి షకీల గురించి చెప్తూ ఎమోషనలయ్యారు.