వామ్మో, ‘బిగ్ బాస్’లో షకీలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ చెబుతూ వస్తున్న హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున. అయితే షకీలా.. ఈ పేరు తెలియని వారు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో తెలియని వారు ఉండరు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన షకీలా ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తనే హీరోయిన్ గా అనేక బి గ్రేడ్ సినిమాల్లో నటించింది. బి గ్రేడ్ సినిమాలతో అబ్బాయిల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

షకీలా తెలుగమ్మాయి అయినా మలయాళంలో స్టార్ గా ఎదిగింది. తమిళ్ లో కూడా ఎక్కువ సినిమాలు చేసింది. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే మలయాళంలో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలని వాయిదా వేసుకునేవారు. కానీ ఏజ్ పెరిగిన తర్వాత బి గ్రేడ్ సినిమాలు చేయడం తగ్గించి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలుపెట్టింది. తన బంధువులే డబ్బుల విషయంలో తనని మోసం చేయడంతో ఎంత స్టార్ డమ్ వచ్చినా, డబ్బులు సంపాదించినా సరిగ్గా సెటిల్ అవ్వలేకపోయింది. కొన్నాళ్ళు సినిమాలకు పూర్తిగా దూరమైన షకీలా ప్రస్తుతం తమిళ్ లో ఓ షో చేస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తే చేసుకుంటూ ఉంటుంది.

ప్రస్తుతం బోల్డ్ క్యారెక్టర్స్ కి చాలా దూరంగా ఉంటుంది. అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది ట్రాన్స్ జెండర్స్, అనాథల బాగోగులు చూసుకుంటుంది. ఒకప్పుడు బి గ్రేడ్ స్టార్ గా ఎదిగిన షకీలా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పద్దతిగా చేసుకుంటూ వస్తుంది. తెలుగులో ఇలా చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చింది. మరి బిగ్ బాస్ లో షకీలా ఎలా ఆడుతుందో, ఎలా ఉంటుందో చూడాలి. షకీలా ఎంట్రీతో ఈ సారి బిగ్ బాస్ కి మరింత హైప్ వచ్చింది. శృంగార తార షకీలా రూ.3.5 లక్షలు తీసుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *