‘ఢీ` డాన్సు షో గత కొన్నేళ్లుగా విజయవంతంగా రన్ అవుతుంది. దీని నుంచి వెళ్లిన వాళ్లు ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఈ షోకి జడ్జ్ లు తరచూ మారుతున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రణీత జడ్జ్ లుగా ఉన్నారు. ప్రస్తుతం సెలబ్రిటీ ఢీ షో రన్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో శేఖర్ మాస్టర్ పర్సనల్ విషయాలు బయటకు రావడం హాట్ టాపిక్ అవుతుంది. ఇందులో సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర చిన్న పాటి సెలబ్రిటీలు డాన్సులు చేస్తున్నారు.
చివర్లో యాంకర్ శివ వచ్చాడు. తను మైక్ తీసుకుని మాట్లాడుతూ, సడెన్‌గా శేఖర్ మాస్టర్ ఎఫైర్ విషయం బయటపెట్టాడు. ఆయనపై సంచలన ఆరోపణలు చేశాడు. మొదట సింపుల్‌గా ఓ ప్రశ్న అడుగుతాను మాస్టర్ అంటూ స్టార్ట్ చేశాడు శివ. శేఖర్ మాస్టర్ చెప్పు అనగానే, మీకు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి మాస్టర్
అని బాంబ్ పేల్చాడు యాంకర్ శివ. దీనికి శేఖర్ మాస్టర్ ఫైర్ అయ్యాడు. `ఏ ఎవర్రా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది. అంతేకాదు షోలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు.
శేఖర్ మాస్టర్‌పై ఇలాంటి రూమర్ ఏంటని వాళ్లంతా ఆశ్చర్యపోయారు. దీనికి శేఖర్ మాస్టర్ అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యాడు. అయితే దీనికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు యాంకర్ శివ.. కానీ శేఖర్ మాస్టర్ గట్టిగా స్పందించాడు. నోరు మూసుకో ఇంకేం మాట్లాడొద్దు నువ్వు.. నాకో ఫ్యామిలీ ఉంది. పిల్లలున్నారు` అంటూ మండిపడ్డాడు. అంతేకాదు అతన్ని పంపిస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా? అంటూ మరింతగా రెచ్చిపోయాడు శేఖర్ మాస్టర్.