తాజాగా సితార ట్రెడిషనల్ వేర్ ధరించి డాన్స్ వీడియో చేశారు. పాటకు ఆమె సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సితార క్లాసిక్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. క్యూట్ బేబీ డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సితార వీడియో వైరల్ గా మారింది. త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు.
సర్కారు వారి పాట మూవీలో ‘పెన్నీ’ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం.
చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు. గౌతమ్ సోషల్ మీడియాను వాడడు. సితార మాత్రం తరచుగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. సితారకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో పిల్లలకు సంబంధించిన వీడియోలు, సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇక తరచుగా పేరెంట్స్ తో కలిసి విదేశీ టూర్లు వెళుతుంటారు. విదేశాల్లో తన ప్రతి మూమెంట్ కెమెరాలో బంధించి ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.