ఇండస్ట్రీ మరో విషాదం, ఆ వ్యాధితో పోరాడుతూ ప్రముఖ నటి మృతి.

నటి సీమా డియో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు అభినరు డియో మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా అభినవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మ అల్జీమర్స్‌ వ్యాధితో మూడేళ్లుగా పోరాడుతోంది. అయితే ఆమె కుమారుడు అభినయ్ డియో తన తల్లి మరణ వార్తని తెలియజేశారు. హిందీ చిత్రాలలో మాత్రమే కాకుండా సీమా డియో మరాఠీ చిత్రాల్లో సైతం గుర్తింపు పొందారు. బాంద్రాలోని తన నివాసంలో సీమా డియో ఈ ఉదయం 8.30 గంటలకు మరణించినట్లు అభినయ్ డియో తెలిపారు.

తన తల్లి మృతికి గల కారణాలని అభినయ్ వివరిస్తూ..వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలే ఆమె మరణానికి కారణం అని తెలిపారు. గత మూడేళ్ళుగా తన తల్లి అల్జీమర్స్, డిమెంటియా వ్యాధితో పోరాడుతున్నారు. ఈ వ్యాధి వాళ్ళ కండరాలు క్రమంగా తమ పనితీరుని మరచిపోతాయి. తద్వారా ఒక్కో అవయవం దెబ్బతింటూ వస్తుంది. కండరాల శక్తి క్షీణించడం వల్ల ఇలా జరుగుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా వయసు ప్రభావం వల్ల ఆమెకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి అని అభినయ్ డియో అన్నారు. సీమా డియోకి ఇద్దరి పిల్లలు సంతానం.

ఆమె భర్త రమేష్ డియోకూడా నటుడే. గత ఏడాదే రమేష్ డియో మరణించారు. సీమా డియో అంత్యక్రియలని ఈ సాయంత్రం శివాజీ పార్క్ లో నిర్వహించబోతున్నట్లు అభినయ్ డియో తెలిపారు. సీమా డియో ఫ్యామిలీ మొత్తం సినీ రంగంలోనే ఉన్నారు. ఆమె మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపుతున్నారు. సీమా డియో మొదటి కొడుకు అజింక్య డియో హిందీ, మరాఠీ చిత్రల్లో సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు. ఇక అభినయ్ డియో ఫిలిం మేకర్ గా సెటిల్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *