దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి సితార యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. వీళ్ల లాగే డైరెక్టర్ మారుతి డాటర్ హియా దాసరి కూడా మంచి టాలెంటెడ్. తను పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తుంది. కొడుకేమో మ్యూజిక్, బ్యాండ్స్ అంటూ టాలెంట్ చూపిస్తుంటాడు. హియా పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రీసెంట్‌గా ఓ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది. అల్లు అరవింద్ వంటి కొందరు సినీ ప్రముఖులు విచ్చేసి హియా ప్రతిభను మెచ్చుకున్నారు. అయితే మారుతీ ఒక ఆర్టిస్ట్ అని చాలా తక్కువమందికి తెలుసు.
చదువుకొనే రోజుల్లో బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. ఆ తరువాత యానిమేషన్ కోర్స్ నేర్చుకోవడం.. అక్కడే నిర్మాత బన్నీవాసుతో పరిచయం .. అల్లు అర్జున్ ను కలవడం.. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన కూతురు కూడా ఆర్టిస్ట్ గా మారింది. మారుతీ కూతురు పేరు హియా. తండ్రిలానే ఆమె కూడా చిన్నతనం నుంచి బొమ్మలు వేయడం నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 18 ఏళ్లు.
మంచి ఆర్టిస్ట్.. ఈ మధ్యనే ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్రాండ్ గా జరిగింది. అల్లు అరవింద్, బేబీ టీమ్ కూడా ఎగ్జిబిషన్ లో సందడి చేశారు. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ లో హియా అందంగా ఉంది. ఇక ఆమెను చచూసిన నెటిజన్స్.. చూడడానికి బాగానే ఉంది.. ముందు ముందు హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి హియా.. ఆరిస్ట్ గా కొనసాగుతుందా.. ? ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా.. ? అనేది చూడాలి.