ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్ట్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పూజ మూర్తి, నయని పావని, అశ్విని శ్రీ, భోలే షావలి, అర్జున్ అంబటి హౌస్లో అడుగుపెట్టారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. అర్జున్ అంబటి మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు. అయితే ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన హోస్ట్ నాగార్జున అంబటి అర్జున్, పూజ మూర్తి, భోలే షావలి, నయని పావని, అశ్విని శ్రీ లను హౌస్లో కి పంపించారు. వీరిలో అర్జున్ మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు.
నయని పావని, పూజ మూర్తి అయితే మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు. అర్జున్ తన గేమ్ తో ఆకట్టుకున్నాడు. టాస్క్ లలో సత్తా చాటాడు. ఖచ్చితంగా మాట్లాడేవాడు. ఇక కష్టపడి ఫినాలే అస్త్ర గెలిచిన అర్జున్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. ఈ సీజన్లో అనూహ్యంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లారు. అర్జున్ అంబటికి ఆరో స్థానం దక్కింది. 5వ స్థానంలో ప్రియాంక నిలిచింది. యావర్ రూ. 15 లక్షలు తీసుకుని 4వ స్థానంతో టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. శివాజీకి 3వ స్థానం. అమర్ రన్నర్, ప్రశాంత్ విన్నర్ అయ్యారు.

వైల్డ్ కార్డుతో రావడం అర్జున్ కి మైనస్ అయ్యింది. షో ప్రారంభం నుండి ఉంటే అతడు టైటిల్ రేసులో ఉండేవాడు. అయితే ఈ షో కారణంగా అర్జున్ అంబటికి బంపర్ ఆఫర్ దక్కింది. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఆఫర్ కొట్టేశాడు. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా తాను రామ్ చరణ్ తో ప్రకటించిన చిత్రంలో పాత్ర ఆఫర్ చేశాడు. దాంతో చరణ్ ఉబ్బితబ్బిబయ్యాడు. వచ్చే ఏడాది రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.