ప్రస్తుత కాలంలో రోగాలు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. వాతావరణ మార్పులు వల్ల వచ్చే వ్యాధులు త్వరగానే నయమవుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఎంత చికిత్స తీసుకున్నా మీకు రోగాల నుంచి ఉపశమనం లభించదు. అయితే ఇక జబ్బుల్లో రకరకాల జబ్బులుంటాయినేది అందరికీ తెలిసిన విషయమే! అందులో కొన్ని వింత వింత జబ్బులుంటాయనేది మాత్రం కొందరికి తెలిసిన విషయం! అతిగా నవ్వినా.. ఏడ్చినా.. కోపగించుకున్నా.. అలిగినా.. తిట్టినా.. చివరికి అరిచినా.. ఆవలించినా..! ప్రపంచంలో ఉన్న ఏదోక జబ్బు కిందికే వస్తుంది. కానీ ఇవన్నీ సమస్యే లేని జబ్బులు కావడంతో.. ఎవరికీ తెలియకుండానే ఉంటున్నాయి.
హానికారం కాని జబ్బుల లిస్టులోనే.. రేర్ డెసీజ్‌లలో ప్లేస్ అయినాయి. అయితే ఇలాంటి ఓ రేర్ డెసీజే మన స్టార్ హీరోయిన్ స్వీటీకి కూడా ఉందటనేది ఇప్పుడు హాట్ న్యూస్. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా నామ్ కమాయించిన అనుష్క తాజాగా ఓ రేర్ డెసీజ్ తో బాధపడుతున్నారట. నవ్వు నాలుగు విధాల చేటనే సామెతతో.. తల పట్టకుంటున్నారా. ఎస్ ! ఎందుకంటే.. తను నవ్వడం షురూ చేస్తే.. అసలు ఆపుకోలేదట. దాదాపు 20నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటారట. పక్క వాళ్లు ఫీలవుతున్నా.. పిచ్చొళ్లలా అనుకుంటున్నా.. భయంతో పక్కకు పరిగెత్తినా.. ఆమెను ఆపడానికి ప్రయత్నించినా కూడా.. నవ్వు అసలేమాత్రం ఆగదట మన స్వీటీకి.
అయితే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. మన స్వీటీనే.. ఎస్ ! తాను నవ్వడం స్టార్ట్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు నవ్వడం ఆపడం లేనని చెప్పిన స్వీటీ.. ఈ జబ్బును కంట్రోల్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నానన్నారు. అయితే గూగుల్ మాత్రం అనుష్క అబ్ నార్మల్ నవ్వు గురించి షాకింగ్ రిజెల్ట్ ఇస్తోంది. ఇదో nervous system disorderఅని కోట్ చేస్తోంది. పాతోలాజికల్ లాఫ్టర్ అండ్ క్రయింగ్ అని అంటోంది. దీని వల్ల బ్రెయిన్‌లో కొన్ని నర్వ్స్ డ్యామేజ్ అవుతాయని.. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదుకానీ.. క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువైందని చెబుతోంది.
అలాగే తమిళ్ హీరో జీవా నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఫియాబాజ్ పై. తాను కూడా మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపింది. మయోసైటిస్ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే తాను ఇంట్లో వారికి కూడా ఈ విషయం చెప్పలేదని, ఇంట్లో వారికి తెలియకుండా ముంబైలో ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నానని తెలిపింది. తన వ్యాధి గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.