ఎట్టకేలకు రాజీవ్ కనకాల తాను చేసిన తప్పును ఒప్పుకుని సుమకు క్షమాపణలు చెప్పారు. సుమ గర్భవతిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అలాంటి పనులు చేసి ఆమెను చాలా బాధపెట్టారట. అయితే తన పెళ్ళై 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ నాటి విషయాలను, అప్పుడు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది సుమ.
తమ పెళ్లి రోజు సందర్భంగా సుమ, రాజీవ్ కు పిల్లలు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ లో కొద్దిసేపు గడిపారు. అనంతరం తమ పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు రాజీవ్ , సుమ. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు ఈ జంట. అందులో ఓ నెటిజన్ భాగస్వామికి తెలియకుండా వారి ఫోన్‌ను ఎప్పుడైనా చెక్ చేశారా? అని అడిగితే.. రాజీవ్ కనకాల నో అని చెప్పాడు. కానీ సుమ మాత్రం యస్ అని చెప్పింది.
దాంతో రాజీవ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత తమ గొడవలగురించి తెలిపారు. ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తాడు కానీ ఎంత టైం అయినా వచ్చేవాడు కాదు. ఇలా చాలా సార్లు చేశాడని సుమ తెలిపింది. అప్పట్లో అలా చేసిన దానికి ఇప్పుడు సారీ చెప్పాడు రాజీవ్ కనకాల. దాంతో సుమ తెగ సంబరపడిపోయింది.