జబర్దస్త్ షోలో అప్పటికే చమ్మక్ చంద్ర స్కిట్లు టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుండేవి. చంద్ర టీంలో అంతకు ముందు లేడీ గెటప్పులుండేవారు. లేదంటే చంద్రనే ఆడ వేషం వేసేవాడు. కానీ ఒక్కసారి సత్య ఎంట్రీ ఇచ్చాక టీం మరింతగా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీ తన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిపారు. వెండితెరపై చేసిన లెజెండ్ సినిమాతో తనకు మంచి పేరు వచ్చిందన్నారు. ఆ సమయంలో డైలాగ్ ఎలా చెప్పాలి అనేది బోయపాటి శ్రీను యాక్టింగ్ చేసి చూపించారని అన్నారు.
అలాగే సరైనోడు, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించినట్లు తెలిపారు. రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ తనకు చాలా ఇష్టమైన చిత్రమన్న ఆమె అందులో తనకు మంచి పాత్ర దక్కిందని సత్యశ్రీ వెల్లడించారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో కొన్ని ప్రాజెక్టులను వదులుకున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా మన్మథుడు నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన బంగార్రాజు సినిమాలో అవకాశాన్ని చేజార్చుకున్నట్లు సత్యశ్రీ వెల్లడించారు. 2014 లో పదో తరగతి అయిపోయిదన్న ఆమె తనకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టమని పేర్కొన్నారు.
తన కోసం తన తల్లి ఇండస్ట్రీ లైఫ్ ను త్యాగం చేశారని చెప్పారు. అలాగే తన అమ్మమ్మ కాకినాడ జిల్లాకు చెందిన వారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే తన అమ్మమ్మ ప్రజల కోసం పార్టీ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చాలా మందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సత్యశ్రీ తన నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండటంతో ఆమెను అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది.