జగన్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. కనీసం రాజధాని కూడా నిర్మించలేదని మండిపడ్డారు. మైదుకూరు నియోజక వర్గంలో షర్మిల ప్రచారం కొనసాగుతోంది. దువ్వూరు మండల కేంద్రంలో షర్మిల మాట్లాడే సమయంలో ఒకతను జై జగన్ అని నినాదాలు చేశారు. ఆ వైసీపీ కార్యకర్తను పిలిచి మాట్లాడించారు షర్మిల.
జగన్ చేసిన అభివృద్ధిని చూపించాలని కోరారు. ‘మీ లాగే ఒకప్పుడు నేను జై జగన్ అన్న. జగన్ వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతారని ఆశించ. రాష్ట్ర అభివృద్ధి పై మాట తప్పుతాడని అనుకొలేదు. మద్యపాన నిషేధం అమలు చేస్తాడని భావించ? ప్రత్యేక హోదా సాధిస్తాడని ఊహించ. పోలవరం కడతామంటే నిజమే అనుకున్న.
కానీ రాష్ట్రానికి కనీసం రాజధాని లేదు..? మాట ఇస్తే నిలబడటం వైఎస్ఆర్ లక్షణం. జగన్ మాట తప్పి, మడమ తిప్పాడు. మాట తప్పిన జగన్‌ను ఏమనాలి ? అక్రమాస్తుల కేసులో అరెస్టై జగన్ జైల్లో ఉన్న సమయంలో 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. అయినప్పటికీ తనకు గుర్తింపు లేదు అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.