శరత్ బాబు చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.

శరత్ బాబు సినిమాల్లో ఇంకా స్థిరపడుతున్న సమయంలో రమాప్రభ పాపులర్ నటి. ఆ సమయంలో వారిద్దరు మధ్య ఏర్పడిన పరిచయం.. క్రమేనా ప్రేమగా మారింది. దీంతో 1974 ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 1988లో విడాకులు తీసుకున్నారు. వారిమధ్య ఏర్పడిన మనస్ఫర్థలే ఇందుకు కారణమని తెలిసింది. ఆ తర్వాత రమప్రభ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఆసరా కోసం శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటే.. ఆయన అవసరం కోసం తనని పెళ్లిచేసుకున్నాడని ఆరోపించారు.

అయితే శరత్ బాబు 2014 తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. చివరిసారిగా శరత్ బాబు తెలుగులో 2021 లో రిలీజయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో వెండితెరపై కనిపించారు. ఇక తమిళ్ లో ఇటీవలే వచ్చిన వసంత ముల్లై అనే సినిమాలో కనిపించారు. అయితే శరత్ బాబు చివరి సినిమా త్వరలో రిలీజ్ కానుంది. MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమాలో శరత్ బాబు నటించారు.

ఈ సినిమాలో శరత్ బాబు, జయసుధ కలిసి నటించారు. ఆయన చివరిసారిగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నరేష్ – పవిత్ర కథతో తెరకెక్కుతుండటంతో ఆయన సూపర్ స్టార్ కృష్ణ పాత్ర వేసినట్టు సమాచారం. కానీ అంతలోనే ఆయన మరణించడంతో చిత్రయూనిట్ కూడా విషాదంలో మునిగింది. ఆయన్ని చివరిసారిగా ఈ సినిమాతో వెండితెరపై చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *