సర్జరీకోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్థస్త్ శాంతి స్వరూప్, వైరల్ వీడియో.

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోయలో ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. మొదటి నుంచీ ఉన్నవారు కూడా చాలా మంది జబర్థస్త్ ను వీడి వెళ్ళిపోయారు. కాని ఫస్ట్ నుంచి ఈ స్టేజ్ నే నమ్ముకున్నాడు శాంతి అలియాస్ శాంతి స్వ‌రూప్ . చాలా మంది శాంతి స్వ‌రూప్ అంటే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు గానీ జ‌బ‌ర్ద‌స్త్ శాంతి అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. అయితే చాలా మంది శాంతి స్వ‌రూప్ అంటే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు గానీ జ‌బ‌ర్ద‌స్త్ శాంతి అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు.

లేడి గెట‌ప్‌లో అత‌డికి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పైకి న‌వ్వుతూ క‌నిపిస్తూ అంద‌రిని న‌వ్విస్తున్న శాంతి స్వ‌రూప్ కు ఓ పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ఆ మ‌ధ్య ఎంతో ఇష్ట‌ప‌డి ఓ ఇల్లు కొనుక్కున్నాను అంటూ అత‌డు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అత‌డే స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఇల్లు అమ్మాల్సిన క‌ష్టం ఏం వ‌చ్చింద‌ని అనుకుంటున్నారా..? శాంతి స్వ‌రూప్ వాళ్ల అమ్మ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

ఆమెకు శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం. స‌ర్జ‌రీ కోసం త‌న వ‌ద్ద డ‌బ్బు లేక‌పోవ‌డంతో ఇంటిని అమ్మేస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తెలిపాడు. ఈ విష‌యం త‌న త‌ల్లికి తెలియ‌ద‌ని, ఆమె కంటే త‌న‌కు ఏదీ ముఖ్యం కాద‌ని చెప్పుకొచ్చాడు. త‌ను ఇంటిని అమ్మేస్తున్న విష‌యం అమ్మ‌కు తెలిస్తే అస్స‌లు ఒప్పుకోద‌ని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు అత‌డికి మ‌ద్దుతుగా కామెంట్లు చేస్తున్నారు. అధైర్యపడొద్దని, అమ్మగారు త్వ‌ర‌గానే కోలుకుంటారని ధైర్యం చెబుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం గొప్ప‌దంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *