శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్, అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి అయితే శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది. గతంలో ఓ టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
మీకు బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త ఏది..? సంతోషకరమైన వార్త ఏది అని ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు. మొదటి విషాదకరమైన వార్త ప్రధాని ఇందిరాగాంధీ మరణం, ఇందిరాగాంధీ మరణించి పోయిందని నేను చాలా ఆశ్చర్యపోయాను. 16 బుల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి ఆమె మరణం ఒక సంచలనం అని చెప్పుకొచ్చారు.
రెండో వార్త ఏది అని అడగగా.. ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త చెప్పారు శాంతి స్వరూప్. ఇందిరాగాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణము చాలా దారుణమని.. మరణములో ఆయన శరీరము ముక్కలు ముక్కలూ అయిందని అందుకే ఆ వార్త ఇప్పటికీ నాకు వస్తుంది పోయిందని సీనియర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు శాంతి స్వరూప్ ఇప్పుడు ఇలా మారాడు ఏమిటి అని పలువురు చర్చించుకోవడం విశేషం.