పండుగ రోజు నువ్వుల నీటితో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. నువ్వులు శనిదేవునికి ప్రీతికరమైన వస్తువు, కాబట్టి శని సమస్య నుండి విముక్తి పొందడానికి నువ్వులను స్నానం చేసే నీటిలో వాడండి. అయితే మకర సంక్రాంతి పర్వదినాన మనం ఏ పనులు చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. మకర సంక్రాంతి పర్వదినాన పొరపాటున కూడా మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు.
ఉదయాన్నే స్నానం చేసిన తరువాతనే ఆహారం తీసుకోవాలి. మకర సంక్రాంతి పర్వదినాన సాయంత్రం సమయాల్లో. రాత్రి వేళల్లో భుజించకూడదు. ఈ విషయాలను ఎవరైతే పాటించరో వారిపై ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి. మకర సంక్రాంతి పర్వదినాన పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మసాలాలతో తయారు చేసిన నాన్ వెజ్ ఆహారాన్ని తింటే అది ప్రతికూల శక్తులకు ఊతమిస్తుంది. మకర సంక్రాంతి పర్వదినాన శాకాహార భోజనమే చేయాలి. ఆకుకూరలు.
కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి . నాన్ వెజ్ తిన్నవారికి కోపం అధికమవుతుంది. ప్రకృతితో ముడిపడి ఉండే మకర సంక్రాంతి పండుగ నాడు ప్రకృతికి హాని తలపెట్టకూడదు. పండుగ రోజు ఎవరు పొరపాటున కూడా చెట్లు నరకకూడదు. అలా చేస్తే పాపం మన వెంటే వస్తుందని చెబుతారు . మకర సంక్రాంతి పర్వదినాన పేదలను, నిస్సహాయులను అవమానించడం చేయకూడదు.
ఇలా చేస్తే పాపం వెంటాడుతుంది. పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఇంటికి వచ్చిన వారిని రిక్త హస్తాలతో పంపకూడదు. సాధ్యమైనంత వరకు దానధర్మాలు చేయాలి. మకర సంక్రాంతి పర్వదినాన పశువుల నుండి పాలు పితకకూడదు. కనుమ రోజున మనం పశువులను పూజించుకుంటాం కాబట్టి ముందు రోజు పాలు పితకకూడదని దూడలకు పాలు వదిలేయాలని చెబుతారు.