పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్.

సనా ఖాన్ సినిమా నుండి వైరాగ్యం తీసుకున్నారు. జీవితం అంటే డబ్బు, హోదా, ఫేమ్ కాదని తెలుసుకున్నానని, దేవుని ఆదేశం మేరకు సినిమా జీవితం వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇకపై సినిమాలలో నటించమని ఎవరూ సంప్రదించ వద్దని ఆమె తన సందేశంలో పొందుపరచడం జరిగింది. అయితే గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ దంపతులు తల్లిదండ్రలు కాబోతున్నామని ప్రకటించారు.

తాజాగా సనా ఖాన్ బుధవారంన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. తమకు బాబు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది సనా. అందులో.. ‘‘అల్లాహ్.. మా బిడ్డ కోసం మమ్మల్ని ఉత్తమ తల్లిదండ్రులుగా మార్చుగాక. మీ ప్రేమ, దీవెనలు మాపై ఉంచాలని అందర్నీ కోరుకుంటున్నాం. ప్రతీ ఒక్కరినీ అల్లా కాపాడుతాడు’’ అంటూ రాసుకొచ్చింది. దానితో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సనా ఖాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

సనా ఖాన్ మోడల్ గా కెరీర్ ను ప్రారభించింది. తర్వాత పలు యాడ్ ఫిల్మ్ లలో నటించింది. 2005 లో వచ్చిన హిందీ సినిమా ‘యో హై హై సొసైటీ’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సనా. హిందీతో పాటు తమిళం సినిమాలలో ఎక్కువగా నటించింది. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2010లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాలో నటించింది. తర్వాత ‘గగనం’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించింది. తర్వాత ‘మిస్టర్ నూకయ్య’, ‘గజ్జెల గుర్రం’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి సినిమాల్లో నటించింది సనా ఖాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *