రాత్రి 1:30కి సమంతకు విజయ్ దేవరకొండ వీడియో కాల్, ఏం మాట్లాడుకున్నారో చుడండి.

తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఇందులో సమంతతో వీడియో కాల్ మాట్లాడుతూ తనను మిస్సవుతున్నా అని చెప్పడంతో ఒక జోక్ కూడా చెప్పి సామ్‌ను నవ్వించాడు. అయితే ఇది వీడియో కాల్ కాదు రికార్డెడ్ వీడియో అని తెలిసిపోతుంది. ఎందుకంటే సమంత కాల్ మాట్లాడేటప్పుడు తన కళ్లద్దాల్లో ఫోన్ మిర్రర్ అవుతుంది. ఐఫోన్‌లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు పైన రెడ్ కలర్‌లో పడే టైమర్‌ను చూడవచ్చు.

కాబట్టి ఇది సినిమా ప్రమోషన్ కోసం రికార్డ్ చేసిన వీడియో అని అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా అర్ధరాత్రి సమంత కు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు. సామ్ కి కాల్ చేసి నాక్ నాక్ జోక్ చెప్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. ఇక ఇందులో సమంత అర్ధరాత్రి ఒకటిన్నర అయ్యిందని, ఇప్పుడు జోక్ ఏంటి అని అడగడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్ధరాత్రి సమంత వీడియో కాల్ చేయడమే కాకుండా నిన్ను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ చెప్పడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇక మరికొందరు అసలు సామ్ ఆ వీడియో కాల్ మాట్లాడింది లేదని, అది సెల్ఫీ వీడియో అని చెప్పుకొస్తున్నారు. అది ఆమె గ్లాసెస్ లో కనిపిస్తుందని చెప్తున్నారు. వీడియో కాల్ లా చూపిద్దామనుకున్నా.. సామ్ ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. లైగర్ పరాజయం తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ ప్రయత్నిస్తున్నాడు. మరియు ఆ ప్రయత్నాలు ఈ సినిమాతో ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *