అర్ధరాత్రి వస్తావా అంటూ సమంతకు మెసేజ్ చేసిన వ్యక్తి, ఆ షాకింగ్ స్క్రీన్ షాట్లు వైరల్.

హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత సమంత రూత్ ప్రభు వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వచ్చింది. అయితే, అప్పట్లో గ్లామరస్ రోల్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం పంథాను మార్చుకుంది. ఫలితంగా ప్రయోగాత్మక చిత్రాలను చేస్తోంది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ మూవీలను చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. అయితే సినినటీనటులు జిమ్, వర్కౌట్లు, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంటారు. అందులో స్టార్ నటీనటులు అయితే చేస్తుంటారు.

ఇక వీరి ట్రైనర్స్ కూడా స్టిక్ట్స్ గా ఉంటారు. అందులో సమంత ట్రైనర్ మరీ స్ట్రిక్ట్ లా ఉన్నాడు. ఈ అందాల తార రీసెంట్ గా చేసిన సినిమా ఖుషీ. విజయ్ దేవరకొండ సరసన నటించిన సామ్ సూపర్ హిట్ ను అందుకుంది. కొన్ని రోజులుగా హిట్ లు లేక బాధ పడుతున్న ఇద్దరు కూడా ఖుషీ సినిమాతో ఫుల్ చిల్ అయ్యారు. ఇక సమంత తన వ్యాధి వల్ల విదేశాలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది సామ్.

ఫుల్ టైడ్ లో ఉన్న ఎవరైనా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. అదే విధంగా సండే రోజు రెస్ట్ తీసుకోవాలి అనుకుంది సామ్. కానీ తన ట్రైనర్ మాత్రం ఊరుకోలేదు. అర్దరాత్రి మెసేజ్ పెట్టి మరీ సమంతకు గుర్తు చేశాడట. కానీ సండే కదా వద్దు అన్నా కూడా వినలేదట ట్రైనర్. బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పినా ఊరుకోలేదట.. పొద్దున్నే జిమ్ కి వచ్చి రెడీగా ఉన్నాడట. సండే అయినా కూడా వదలలేదట. అందుకే ఇదొక బ్యాడ్ డే అని ఫన్నీగా తన ఇన్ స్టా స్టోరీ పెట్టింది సామ్. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా పంచుకుంది. జునైద్ చేసిన మెసేజ్ లకు ఉదయం రిప్లై ఇచ్చింది సామ్.

ఈ రోజు వద్దు, కాస్త బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పింది. అయినా కూడా వినని జునైద్ జిమ్ కి వచ్చి ఉన్నా.. నువ్వు ఎక్కడా అంటూ సమంతకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత చేసేదేమి లేక జిమ్ కు వెళ్లిందట సామ్. ఈ విధంగా వర్కౌట్లు చేస్తున్నా.. మరో క్రూరమైన ఆదివారం ఇది అంటూ పోస్ట్ చేసింది. అయినా జిమ్ లు, వర్కౌట్లు కామన్. కానీ మరీ రెస్ట్ కూడా ఇవ్వకుండా ఇంత కఠినంగానా అంటూ ట్రైనర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సామ్ అభిమానులు. కాస్త రెస్ట్ తీసుకో సామ్ అని కూడా జాగ్రత్తలు చెబుతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *