న్యూయార్క్ లో సమంత కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా..?

సమంత ఒక్క డ్రెస్ కే అంతా ఖర్చు చేసి కొనుగోలు చేసిందా అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ సెలెబ్రెటీల డ్రెస్సులు, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, మెడలో ధరించే నెక్లెస్ లు,చేతికి పెట్టుకునే వాచ్ ల ఖరీదు కోట్లలో ఉంటుంది అనే సంగతి ఇప్పటికే ఎంతమంది హీరో హీరోయిన్ల విషయంలో చూశాం. అయితే అయితే మిగతా విషయాల గురించి పక్కనబెడితే సామ్ ధరించిన స్పెషల్ చీర ధర.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సమంత హిట్ కొట్టి చాలారోజులు అయిపోయింది. అప్పుడెప్పుడో 2019లో ‘ఓ బేబీ’ మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నుంచి పలు సినిమాలు చేస్తున్నా ఏవీ వర్కౌట్ కావడం లేదు. దీంతో ఇప్పుడు ఈమె ఆశలన్నీ ‘ఖుషి’పై పెట్టుకుంది. సెప్టెంబరు 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సమంత.. దీని ప్రమోషన్స్‌కి రాకపోవచ్చని తెలుస్తోంది. తాజాగా న్యూయార్క్ లో దిగిన ఫొటోల్ని సమంత.. తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఇందులో బ్లాక్ కలర్ డిజైనర్ శారీ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించినట్లు తెలుస్తోంది. దీని ధర ఏకంగా రూ.1,38,000 అని సమాచారం. ఈ కాస్ట్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే సమంత వేసుకున్న ఆ బ్లాక్ శారీ.. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంది. బోర్డర్ అంతా డిజైన్ ఉంది. అలాంటి ఈ చీర దాదాపు లక్షన్నర ఖరీదు కావడం నెటిజన్స్ రియాక్షన్‌కి కారణమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *