యశోద, శాకుంతలం తర్వాత సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాతో పలకరించారు. ఈ సినిమా ఓ బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌తో పాటు డబ్బింగ్ పనులను సమంత పూర్తి చేసినట్టు సమాచారం. అయితే అవును.. సమంత ఇనుములా మారిపోతోంది. శరీరాన్ని అంతగా సానబడుతోంది. జిమ్ లో నిరంతరం సమంత కాయకష్టం చూస్తుంటే ఔరా! అని ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతలా కసరత్తులతో దడ పుట్టిస్తోంది. తాజాగా సమంత జిమ్ లో శ్రమిస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియా ప్రొఫైల్ లో షేర్ చేయగా అది వైరల్ గా మారుతోంది.
నిజానికి మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న సమంత, ఆ రుగ్మతను తగ్గించుకోవడం కోసం చాలా ఆరోగ్య సూత్రాలను పాటిస్తోంది. సమయానికి తిండి, నిదురతో పాటుగా శారీరక శ్రమ కూడా దీనికి అవసరం. కోల్పోయిన ఇమ్యూనిటీ పవర్ ని తిరిగి రాబట్టేందుకు ఒక వేదికగా జిమ్ ని ఉపయోగించుకుంటోంది. సమంత వీల్ బేస్ పై ఎక్సర్ సైజులకు సంబంధించిన తాజా వీడియో వైరల్ అవుతోంది.