టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత పెళ్లి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.నిజానికి సమంత అంటే ప్రతి ఒక్కరికి క్రష్ గా ఉండేది. కానీ ఇప్పుడు సమంత అంటే అందరూ బాగా ఫ్రస్టేషన్ అవుతున్నారు జనాలు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే.
ఈ వ్యాధికి సామ్ చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్తోందనే ప్రచారం జరిగింది. కానీ ఈ భామ మాత్రం ప్రస్తుతం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇక అటు శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది.
అయితే.. తాజాగా హీరోయిన్ సమంత డిఫెరెంట్ లుక్ లో కనిపించింది. హీరోయిన్ సమంత అరగుండుతో ఉన్న ఫోటోలను కొంత మంది వైరల్ చేశారు. అయితే.. దీనిపై హీరోయిన్ సమంత ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కావాలనే నాగచైతన్య ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు.