తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా ఉన్న సమంత తన అందంతో పాటు అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. పెళ్లి తర్వాత ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నెగిటివ్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే సమంత చాలా కాలం నుండి ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత చివరి శస్త్రచికిత్స కోసం రీసెంట్ గానే న్యూయార్క్ వెళ్ళింది.
విజయవంతంగా ఆపరేషన్ ని చేయించుకుంది. కానీ ఆమెకి ఒక ఏడాది పాటుగా డాక్టర్లు విశ్రాంతి అవసరం అని, షూటింగ్ లో వాడే లైట్స్ కి అసలు ఎదురు పడొద్దు అంటూ ప్రత్యేకంగా హెచ్చరించాడట. దీంతో ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే సమంత అతి త్వరలోనే శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట.

ఇప్పటి వరకు ఆమె సంతకం చేసి అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తోందట. అంతే కాకుండా రీసెంట్ గానే ఒక క్రేజీ స్టార్ డైరెక్టర్ సమంత ని కలిసి ఒక స్టోరీ ని వినిపించగా, ఆమె వెంటనే నో చెప్పేసిందట.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈమధ్య కాలం లో చాలా కథలనే ఆమె రిజెక్ట్ చేసిందట. ఇదంతా చూస్తూ ఉంటే ఆమె ఇక సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారు అనే విషయం అర్థం అవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు.