సలార్ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పిన అమ్మాయి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ వేరే లెవెల్. ఈ సీన్‌లో దేవతను ప్రార్థించే చిన్నారి తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు ఫర్జానా సయ్యద్. సలార్ సినిమాలో ఈ అమ్మాయి చేసిన పాత్రతో మూవీ స్టోరీ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమాలో డీ గ్లామరస్‌గా కనిపించినా.. బయట మాత్రం ఫర్జానా చాలా అందంగా ఉంది. అయితే ప్రభాస్ ఓ కీలక ఫైట్ చేస్తున్నప్పుడు ‘కాటేరమ్మ రాలేకపోయింది.. కానీ.. కాటేరమ్మ కొడుకును పంపింది’అంటూ డైలాగ్స్, యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసిందో అమ్మాయి.
ప్రభాస్ ఎంట్రీ సమయంలో ‘మనల్ని కాయాలని దేవుళ్లు ఎట్లైనా రారన్నావ్ కదనే.. కానీ మన కాయడానికి దేవుళ్లు వస్తారని మొక్కుతున్నా’అంటోంది ఆ పాప. ఆ అమ్మాయి పేరు సయ్యద్ ఫర్జానా. ప్రస్తుతం ఈ అమ్మాయి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సెకండాఫ్‌లో ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ఆమె నటించిన సన్నివేశాలు కంటతడి పెట్టిస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫర్జానా సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకుంది. ప్రభాస్ చాలా కూల్‌గా ఉంటారని, ప్రశాంత్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపింది. చిన్నప్పటి నుండి పలు యాడ్స్ లో నటించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత వెండితెరపైకి వచ్చింది.
ఝాన్సీ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మాయికి.. ఆడిషన్స్ ద్వారా సలార్ చిత్రంలో చేసే అవకాశం వచ్చిందట. కళ్లు చూసి డైరెక్టర్ ప్రశాంత్ సెలక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. అప్పుడు సలార్ మూవీ కోసం అని తెలియదని పేర్కొంది. ప్రస్తుతం తాను 10వ తరగతి చదువుతున్నానని తెలిపింది. నితిన్ మూవీ కోసం ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది ఈ పాప. ప్రభాస్‌తో కలిసి ఒక సీన్ ఉందని, అయితే అది మూవీలో లేదని వెల్లడించింది. ఇంత పెద్ద మూవీలో ఛాన్స్ రావడం అందులోనూ ప్రభాస్, నీల్ సినిమా అంటే చాలా సంతోషించానని పేర్కొంది. ముందు షూటింగ్ సమయంలో కాస్త టెన్షన్ పడ్డానని, తర్వాత డైరెక్టర్ నీల్ ఇచ్చిన స్పూర్తితో ఈజీగా చేశానని అన్నారు.
ప్రభాస్‌తో మాట్లాడినప్పుడు.. చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపింది ఫర్జానా. తన క్యారెక్టర్ చూసుకుని నేనేనా అనుకున్నానని, అయితే ఈ క్యారెక్టర్ నచ్చుతుందని భావించానని పేర్కొంది. సలార్ మూవీ చూసి ఉన్నట్లయితే..ఈ పాప యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.