సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా మారింది. ఇక లింగ మార్పిడి చేయించుకోకుండానే.. మరో జబర్దస్త్ నటుడు.. అమ్మాయిగా మారాడు. అతడే.. సాయి. అయితే జబర్దస్త్‌లోని మరో లేడీ కంటెస్టెంట్ సాయిలేఖ కూడా ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిందంటూ చాలాకాలంగా ఓ వార్త వైరలవుతోంది. తాజాగా ఈ పుకారుపై సాయి స్పందించాడు. అలాగే తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.
సాయి మాట్లాడుతూ.. ‘నా అసలు పేరు వెంకటసాయిప్రసన్న కుమార్. ఇంటర్ అయిపోయాక మెడిసిన్‌లో ర్యాంక్ వచ్చింది. ఓసారి ఈవెంట్‌కు వచ్చినప్పుడు హైపర్ ఆది అన్నవాళ్లు నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు కదా.. సెలబ్రిటీ అయిపోతే నీతో కూడా ఫోటోలు దిగుతారు అని చెప్పాడు. నాన్న చాలా బాధపడ్డాడు.. అప్పుడు నేను హైదరాబాద్‌కు వచ్చి రెండు, మూడు ఎపిసోడ్లు చేసి తిరిగి కాలేజీకి వెళ్లిపోయాను. కానీ అక్కడున్నవాళ్లు అప్పుడే అయిపోయిందా? అని హేళన చేశారు.
ఆ మాటలు తట్టుకోలేకపోయాను. కష్టమైనా, ఏదైనా సరే అని కామెడీ షోలో రీఎంట్రీ ఇచ్చి అక్కడే కొనసాగుతున్నాను. మొదట్లో మా నాన్న చాలా బాధపడ్డాడు. డాక్టర్ చదవాల్సినవాడు చీర కట్టుకుని మేకప్ వేసుకుని జబర్దస్త్‌లో చేస్తున్నాడు, మీకేం అనిపించట్లేదా? అని ఇరుగుపొరుగువారు మా నాన్నను సూటిపోటి మాటలనేవారు. అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో నాకు తర్వాత అర్థమైంది.