తల్లిదండ్రుల ముందే అలాంటి పని చేసిన సాయి పల్లవి. ఏం చేసిందో తెలుసా..?

సాయి పల్లవి.. చాలా కాలం సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆమె తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే ఇకపోతే అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రేజ్ పొందిన ఈమె ఎంచుకునే సినిమాలు, పాత్రలు కూడా అంతే హోమ్లీగా ఉంటాయని చెప్పవచ్చు.

డబ్బుకు ఆశపడకుండా అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కంటెంట్ నచ్చకపోతే ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ అయినా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆలస్యమైనా సరే మంచి కథతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా సాయి పల్లవి డాక్టర్ చదివిన విషయం తెలిసిందే..

అయితే ఒకసారి తాను స్మోకింగ్ చేయకూడదు అన్న విషయంపై అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని సిగరెట్టు తాగితే దాని వల్ల కలిగే నష్టాలు ఏంటో అక్కడున్న వారందరికీ వివరించిందట. ఇక సమయంలో తన తల్లిదండ్రులు కూడా ఉండడంతో వారి ముందే స్మోక్ చేసిందట. అయితే ఆ తర్వాత అది నిజం కాదు అని.. డమ్మీ సిగరెట్ అని తెలిపింది. అయితే సిగరెట్ తాగితే ప్రాణాలు పోవడమే కాదు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని.. ఒక దృశ్యాన్ని కూడా అందరికీ చూపించిందట సాయి పల్లవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *