ఇండస్ట్రీలో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ సింగర్ మృతి.

బెంగాలీ గాయకుడు అనూప్ ఘోషల్ కన్నుమూశారని, ఆయన ఆరోగ్యం చాలా కాలంగా విషమంగా ఉందని సమాచారం. ‘మాసూమ్’ సినిమాలోని సూపర్‌హిట్ పాట ‘తుజ్సే అంఘ్ జీవన్’ చిత్రానికి తన శ్రావ్యమైన గాత్రాన్ని అందించిన అనూప్ ఘోషల్ మరణంతో చిత్రసీమలో సంతాపం వెల్లువెత్తింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు అనూప్ ఘోషల్ వృద్దాప్య కారణంగ అనారోగ్యంతో బాధపడుతూ కోల్‌కొతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

బెంగాలీ గాయకుడు అనూప్ ఘోషల్ పలు భాషల్లో పాడి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుం సభ్యులు తెలిపారు. బాలీవుడ్ లో ప్రముఖ గాయకుల జాబితాలో అనూప్ ఘోషల్ పేరు ఎప్పుడూ మారుమోగుతుంది. 1983లో నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ నటించిన సూపర్ హిట్ మూవీ మాసూమ్ లో ఆయన పాడిన ‘ముజ్ సే నారాజ్ నహీ’సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ని ప్రజలు ఇప్పటికీ వినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ పాట ప్రతి హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ..

అనూప్ జీ గొప్ప సింగర్, స్వకర్త.. ఆయన పాడిన పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఇయన బెంగాలీనే కాదు.. ఇతర భాషల్లో కూడా అద్భుతమైన పాటలు పాడారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరలి లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు. 2011లో టీఎంసీ తరుపున ఆయన పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నజ్రుల్ స్మితి పుస్కారం, 2013లో సంగీత్ మహాసన్మాన్ ప్రధానం చేసింది. అనూప్ ఘోషల్ మృతిపై పలువురు సెలబ్రెటీలు నివాళులర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *