BRS పార్టీలో తీవ్ర విషాదం, గుండెపోటుతో బీఆర్ఎస్ కీలక నేత మృతి.

ఎన్నికల ఫలితాలు తేలిన కొన్ని గంటల్లోనే జనగామా జిల్లా BRS పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. జనగామా జిల్లా పరిషత్ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో సోమవారం మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే టిఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటు మరణించారు, హనుమకొండలోని చైతన్యపురిలో తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రోహిణి ఆస్పత్రికి తరలించారు, వైద్యులు చికిత్స చేస్తుండగా తుది శ్వాస విడిచారు,

ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ 20004 లో టిఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేటం చేశారు సంపత్ రెడ్డి, సంపత్ రెడ్డికి భార్య కుమారుడు కూతురు ఉన్నారు, ఎనిమిది సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడు, గత జడ్పిటిసి ఎన్నికల్లో చిల్పూర్ మండల జడ్పిటిసిగా సంపత్ రెడ్డి గెలుపొందారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరి మద్దతుతో జిల్లా జడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు, జిల్లా జడ్పీ చైర్మన్ తో పాటు జనగామ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు సంపత్ రెడ్డి,

రెడ్డి మృతితో తన స్వగ్రామమైన రాజవరం గ్రామంలో విషాదఛాయలనుకున్నాయి, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు, ఆయన మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్ళి రేపు అంత్యక్రియలు చేయనున్నారు, సంపత్ రెడ్డి అకాలమరణం తో అటు జనగామ టిఆర్ఎస్ శ్రీను లోను తీవ్ర విషాదం నెలకొంది, సంపత్ రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత కేసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లె రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *