రాజ్ కుమార్ కోహ్లీ వయసు 93. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రాజ్‌కుమార్ మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ మరణించారు.
93 ఏళ్ళ వయస్సులో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈరోజు అనగా శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రాజ్‌కుమార్ మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఇక రాజ్ కుమార్ కోహ్లీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ముంబయ్ లో జరగబోతున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ ప్రకటించారు.

ఆయన అంత్యక్రియలకు సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాజ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే. కహానీ హమ్ సబ్ కీ, నాగిన్, ముకాబ్లా, జానీ దుష్మన్, పతి పత్నీ ఔర్ తవైఫ్, రాజ్ తిలక్, జీనే నహీ దూంగా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. గౌరా ఔర్ కాలా, డంకా, లూటేరా వంటి హిందీ చిత్రాలతోపాటు దుల్లా భట్టి, మెయిన్ జట్టి పంజాబ్ ది, పిండ్ డి కుర్హి వంటి పంజాబీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.