సబితా ఇంద్రారెడ్డి కార్ చెక్ చేస్తుండగా KTR ఏం చేసారో చుడండి.

సబితా ఇంద్రారెడ్డి..చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి సబితారెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 2000, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి, 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి గెలుపొందారు. తొలి మహిళా హోం మంత్రిగా పదవికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే సాయం, సేవ చేసే గుణం ఉండాలే కాని.. అలాంటి వారికి ఇట్టే గుర్తింపు వస్తుంది.

ఎప్పుడు ప్రజా ప్రతినిధిగా బిజీగా ఉండే రాష్ట్ర మంత్రి రోడ్డున పోయే చిన్నారుల చూసి చలించిపోయారు. కాలి నడకన వెళ్తున్న వారిని తన కారులో గమ్యస్థానం చేర్చారు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్నారు మంత్రి. అదే సమయంలో స్కూల్ ముగించుకుని కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు.

వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి సబితా చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడిగి మరీ.. మంత్రి కారులోనే ఎక్కించుకొని తీసకెళ్లారు. కారులో చిన్నారులతో ముచ్చటిస్తూ.. చాక్లేట్లు అందించి, వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు. గొల్లురు నుండి తండా వరకు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఇద్దరు చిన్నారులను ప్రోత్సహించారు మంత్రి. అనంతరం వారి పేరెంట్స్‌తో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *