రుషికొండపై వైసీపీ సీక్రెట్‌గా కట్టింటిన భవనాల్లో ఏముంది..?

ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న భవనంలోకి అడుగు కూడా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టుగా.. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుని తన కలల సౌదంలోకి అడుగుపెట్టకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చిందని విమర్శించారు.

2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన యువకుడు ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ పాలన సాగించడం వల్లే 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశమైన విధానాలు, పాలనలో అడ్డగోలు నిర్ణయాల వల్ల రాజధానిగా చేస్తామన్న విశాఖ ప్రాంతంలో కూడా ఆ పార్టీ నాయకులు ఘోరమైన ఓటమిని చవిచూసారన్నారు.

దీని ద్వారా ఇక్కడి ప్రజలు విశాఖ రాజధాని వద్దన్న సంకేతాలను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని, ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆయన గుర్తించాలని సూచించారు. ఓటమికి గల కారణాలను సమీక్షించకుండా.. ప్రజలపై నిందలు వేసేలా మాట్లాడుతున్న ఆయన తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదన్నారు. వైసిపి మునిగిపోతున్న పడవ అని తాను ఎప్పుడో చెప్పానని, తాజా ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *