కిర్రాక్ ఆర్పీ… తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నటుల్లో ఆర్పీ ఒకరు. తనదైన కామెడీతో , పంచ్ లతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసేవారు. తనదైన యాసతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఆర్పీ క్రియేట్ చేసుకున్నారు.
ఇలా ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. కొంతకాలం క్రితం చేపల పులుసు అనే పుడ్ బిజినెస్ ను ప్రారంభించారు. ఆర్పీ ప్రారంభించిన ఈ చేపల పులుసుకి ఫుడ్ బిజినెస్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఫేమ్ తో పాటు ఆ బిజినెస్ కి నెగెటివిటి కూడా పెరిగింది. హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ వ్యాపారాన్ని కిర్రాక్ ఆర్పీ ప్రారంభించాడు. కూకట్ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి.
స్టాల్స్ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లను కూడా ప్రారంభించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.