జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా టార్గెట్ చేశారు. అక్కడితో ఆగకుండా మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ను మధ్యలోకి లాగారు. పవన్ కళ్యాణ్ నీతులు మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు.
పెళ్లాలలను వదిలేసే పవన్ నీతులు మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ ను కాస్త నిశితంగా పరిశలిస్తే.. వెరీఫైడ్ ఖాతా కాదని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల డబ్బులు కట్టిన వారందరికీ వెరీఫైడ్ ఇస్తున్నారు. లేకపోతే లేదు. అయితే నిజంగానే ఆ ట్విట్టర్ ఖాతా సన్నిలియోన్ ది కాదు. ఆమె అధికారిక అకౌంట్ కి బ్లూటిక్ ఉంది. అందులో .. రోజా వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ లేదు.
సన్నీలియోన్ చాలా ప్రొఫెషనల్ అని.. ఇలాంటి రాజకీయ విమర్శలను ఆమె అసలు పట్టించుకోరని.. ఇలాంటివి ఆమె దృష్టికి కూడా లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ను విమర్శించినందు వల్ల జనసైనికులు పెద్ద ఎత్తున సన్నిలియోన్ పేరుతో కౌంటర్లు ఇస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. మరో వైపు రోజా తీరుపై జనసైనికులు పెద్ద ఎత్తున ట్వీట్లు పెడుతున్నారు.
I was a pornstar and have zero regrets about my past. Unlike you I openly did whatever I wished to do.
— Sunny Leone (@isocialsaint) July 14, 2023
The only difference between you and I is, I left the industry, you didn't @RojaSelvamaniRK. https://t.co/peDvfWSDaC