రాజకీయంగా నాకు భవిష్యత్ ఇచ్చి, నా చెల్లి అని చెప్పి, అసెంబ్లీలో నా కోసం సపోర్ట్ గా జగన్ మాట్లాడం ప్రజలంతా చూశారని రోజా అన్నారు. జగన్ ఏ నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయనకు పేరు తెచ్చే విధంగా పని చేస్తానని రోజా అన్నారు.
తనకిచ్చిన పదవితో ఆదాయం తీసుకురావడమే కాకుండా జిల్లాలో తనకిచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు.
క్రెడిబిలిటీకి కేరాఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కుటుంబం అన్న రోజా.. అలాంటి కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. అయితే ఆర్కే రోజా.. 2014,2019 వరుసగా రెండు సార్లు చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. పార్టీ కోసం రోజా చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆమెకు జగన్ మోహన్ రెడ్డి పదవి ఇచ్చిన, ఇవ్వకున్న.. పార్టీ కోసం, జగన్ కోసం గట్టిగా పనిచేసింది. అలాంటి రోజాను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే ప్రయత్నంలో స్థానిక నేతలు ఉన్నారు.