తెలుగులో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడాడు. ఈ స్పీచ్‌లోనే తన సినిమా నిర్మాతల గురించి చెప్పాడు. ‘వకీల్‌సాబ్ దర్శకుడు దిల్‌రాజు, సర్దార్ భగత్ సింగా.. ఏదో ఉంది సినిమా పేరు భగత్ సింగ్ అని గుర్తొస్తుంది. ఆ సినిమా నిర్మాత నవీన్ నుంచి మద‍్దతు అయితే ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ స్పీచ్‌లో పవన్ కల్యాణ్ చెప్పింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి.
అప్పుడెప్పుడో 2021 సెప్టెంబరులో ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో ఈ సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎంతకీ ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. కొన్నాళ్లకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని టైటిల్ మార్చి, షూటింగ్ మొదలుపెట్టారు. కానీ అది కూడా బ్రేకులేస్తూనే వెళ్తోంది. ఇలా సొంత సినిమా పేరే పవన్ కల్యాణ్ మర్చిపోయాడు. మరో సినిమా అయితే పూర్తిగా పక్కనబెట్టేశాడు.
అవును ‘హరిహర వీరమల్లు’ గురించే. 3-4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మూవీని పవన్ పూర్తిగా పక్కనబెట్టేశాడు. షూటింగ్ 50 శాతానికి పైనే పూర్తి చేశారు. కారణమేంటో తెలీదు గానీ అది మూలన పడిపోయింది. ఇదంతా చూస్తుంటే పవన్‌కి సినిమాలపై ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేనట్లు కనిపిస్తోంది. దీంతో పవన్ మతిమరుపు ఈ రేంజులో ఉందా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.