ఏపీలో టీడీపీ సానుభూతిపరులు ఎల్లో మీడియా కూడా బీజేపీ లేని జనసేన టీడీపీ కూటమినే కోరుకుంటోంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే చాలు ఇక అధికారం వచ్చేసినట్లే అని భావిస్తున్నారు. దాంతో పాటు బీజేపీ తమ దారిలోకి రాకపోతే పవన్ కూడా ఆ పార్టీతో బంధం తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీప్ వర్సెస్ జనసేన ఫైట్ మరింత ముదిరింది. ముఖ్యంగా ఇటీవల మంత్రి రోజా తన కొడుక్కు బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చారు. అయితే మంత్రి అయ్యాక లంచాలు తీసుకుంటూ కారు గిప్ట్ గా ఇచ్చారనే విమర్శలు మొదలయ్యాయి. దానిపై ఘాటుగా స్పందించిన మంత్రి రోజా.. జనసేన కార్యకర్తలుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు పిల్ల బచ్చాలు అంటూ కామెంట్ చేశారు.
సోషల్ మీడియా లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతూనే ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ సాగుతుండడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షం, జనసేన నాయకులే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.