గత కొద్ది రోజులుగా తన కూతురు సినీ ఎంట్రీపై వస్తున్న వార్తలపై స్పందించారు. నటన ఎప్పుడూ తప్పు కాదు . “నా కొడుకు.. కూతురు సినిమా రంగంలోకి రావాలంటే చాలా సంతోషిస్తాను. కానీ ప్రస్తుతం నా కూతురు మాత్రం చదువులో రాణిస్తుంది. తను సైంటిస్ట్ కావాలనుకుంటుంది. ఆమెకు ఇప్పుడు సినిమాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం లేదు. ఒకవే ళ ఎప్పుడైనా సినిమాల్లోకి తను రావాలనుకుంటే మాత్రం నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది రోజా. రోజా కూడా బండారు వ్యాఖ్యలపై స్పందించి ఆయనపై కేసు నమోదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే మహిళలు రాజకీయాల్లో రాణించడం కరెక్టేనా? కొత్త తరం మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రోజా విషయంపై తన కూతురు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మను ఇప్పుడు ఇలా చూస్తే ఏడుపొస్తుంది. తన తల్లిని వదిలేయండి.. అంటూ కుటుంబ సభ్యుల ముందు వాపోయిందట రోజా కూతురు. నేను చిన్నపిల్లను.. అమ్మను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు.
ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మను అలా చూడలేదు. అమ్మ అలా దిగులుగా ఉంటే నాకు భోజనం కూడా తినాలనిపించడం లేదు.. అంటూ రోజా కూతురు వాపోయినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంపై రోజా భర్త కూడా స్పందించారు. ఆయన ఘాటుగానే స్పందించారు. ఇప్పటికీ పలువురు సినీ నటులు రోజాకు అండగా నిలబడి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. నటి ఖుష్బూ, నటి రాధిక.. రోజాకు మద్దతు పలికారు. రోజాకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. తాజాగా రోజా కూతురు చేసిన కామెంట్స్ పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.