ప్రత్యర్ధి పార్టీ నాయకులను ఏకిపారేసిన లో మీడియా సమావేశాల్లో అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యర్థులపై విరుచుకు పడటం లో రోజా కి మించిన వారు వైసీపీ పార్టీలో లేరని చాలా ఎగ్రెసివ్ పర్సన్ అంటూ రోజా కి చాలా కోపం ఉంటుందని చాలా మంది రాజకీయ నాయకులు అదేవిధంగా బయట కూడా కామెంట్ చేస్తుంటారు.
అయితే టాలీవుడ్ లో ఆర్కే రోజాకు ఒక క్రేజ్ ఉంటుంది. రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే ఆమె చేస్తున్న వాటికి ఇక్కడ మంచి స్పందన ఉంటుంది. టాలీవుడ్ జనం ఆమె చేస్తున్న కార్యక్రమాలు సహా టీవీ షోస్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆమె మాటలకు అభిమానులు ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఆమెకు ఇప్పుడు టాలీవుడ్ లో శత్రువులు తయారు అయ్యారు అనేది కొందరి మాట.
ఆమె సినిమాలను చేయడానికి ముందుకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అనేది కొందరు చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటో తెలియకపోయినా మన జనాలు ఎక్కువగా కథలు అల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి… ఆమెకు మెగా ఫ్యామిలీ తో బాగా విభేదాలు వచ్చాయని సమాచారం. మెగా హీరో సినిమాలో ఆమెను ఎంపిక చేసినట్టే చేసి పక్కకు తప్పించారు అని సమాచారం. దీనిపై రోజా సీరియస్ గా ఉందని సమాచారం.