తాజాగా కబడ్డీ ఆడారు. తూర్పుగోదావరి జిల్లా ఆదిత్య ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం. వారితో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. అయితే ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ఆటగాళ్ళతో పోటీపడి మరీ కబడ్డీ ఆడారు.
యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమన్నారు మంత్రి రోజా.గ్రామీణ స్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలు వెలికితీసి.. వారి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తామన్నారు. తనకు కూడా చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆడటం ఇష్టమన్నారు. మంత్రి రోజా కబడ్డీ కూత పెట్టారు.. కబడ్డీ ఆడి హల్‌చల్ చేశారు. కాకినాడ ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా..
ఆపై విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అయితే రోజాకు గ్రౌండ్ కొత్త కాదు. కబడ్డీ కొత్త కాదు. అందుకే తను కూడా గ్రౌండ్‌లోకి దిగి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. వారిలో క్రీడాస్ఫూర్తి నింపారు. స్కూల్ డేస్ నుంచీ కబడ్డీ తనకెంతో ఇష్టమన్నారు రోజా. అయితే అప్పుడు గ్రౌండ్‌లో ఆడితే ప్రస్తుతం పాలిటిక్స్‌లో ఆడుతున్నా అంటూ నవ్వేశారు రోజా.