నెల్లూరు బీబీనగర్ సమీపంలో టీడీపీ నేత కిలారి వెంకటస్వామి నాయుడు నివాసం వద్ద ఆనం వెంకట రమణారెడ్డి ఉండగా 8 మంది దుండగులు ఆయనపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆనంపై దాడి చేస్తున్న వారిని అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే రోజక్కకు సూటి ప్రశ్నలు వేస్తున్నానంటూ మొదలుపెట్టిన టీడీపీ నేత వెంకటరమణారెడ్డి నిన్న ఆమె చేసిన చీరల వ్యాఖ్యలపై మండిపడ్డారు.
దిశ యాప్ కోటీ 40 లక్షల మంది డౌన్ లోడ్ చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇన్ని రేప్ లు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్మాదులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నీలాంటి ఉన్మాదులు పుట్టింది ఇక్కడేగా అని విమర్శించారు. టీడీపీ నేతలు కాల్ మనీ, సెక్స్ రాకెట్లలో ఉన్నారంటున్న రోజా.. గతంలో తాను కూడా తన వీడియోలపై ఇచ్చిన ఫిర్యాదు గుర్తు తెచ్చుకోవాలని ఆనం తెలిపారు.
విజయమ్మ, భారతిని ఏమన్నా సహించబోమంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆనం.. మీరు మాత్రం మా కుటుంబాలను ఇష్టారాజ్యంగా తిట్టొచ్చు కానీ మేం మాత్రం ఏమీ మాట్లడకూడదా అని ప్రశ్నించారు. లోకేష్ ను గెలిపించుకోలేని చంద్రబాబుకు చీర పంపుతానన్న రోజా.. విశాఖలో తల్లి విజయమ్మను గెలిపించుకోలేని జగన్ కు ఏం పంపాలని నిలదీశారు. తమకు చీరలు పంపిస్తామన్న రోజా వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆమెకు బికినీ, లిప్ స్టిక్, పాత కట్ డ్రైయర్లు పంపిస్తామన్నారు. కిలోల్లో పంపమంటావా, కంటెయినర్లలో పంపమంటా అని ప్రశ్నించారు.