మహేశ్‌బాబుతో నటించాలని ఆ కోరిక బయటపెట్టిన రోజా.

రోజా.. 2014 ఎన్నికల అనంతరం 2015 తర్వాత సినిమాల్లో కనిపించని రోజా.. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరప ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సమయంలో 2019 ఎన్నికల అనంతరం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి చేపట్టారు. అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘రోజా సెల్వమణి’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు.

2015 తరువాత సినిమాల్లో కనిపించని రోజా.. జబర్దస్త్ కామెడీ షోతో ఆడియన్స్ కి దగ్గర ఉన్నారు. అయితే మంత్రి పదవి చేపట్టిన తరువాత జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పేసి.. ప్రస్తుతం పొలిటికల్ గా బిజీ అయ్యారు. కాగా ఈమె తాజాగా మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోజాతో పాటు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారంతా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా కనిపిస్తూ వస్తున్నారు. రోజా మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే భవిషత్తులో మళ్ళీ నటిస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మాత్రం తనకి ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా రోజా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని అందరికి తెలిసిన విషయమే. మహేష్ బాబుతో ఎప్పుడు నటిస్తున్నారు అని ప్రశ్నించగా రోజా బదులిచ్చారు. “మహేశ్‌బాబుతో నటించాలనేది నాకున్న చాలా పెద్ద కోరిక. దాని కోసం ఎదురు చూస్తున్నాను. అయితే మహేష్ కి అమ్మ పాత్రలో కాకుండా అక్క, వదిన పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను” అంటూ రోజా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *