కోర్టు తీసుకున్న నిర్ణయంతో రోజా అభిమానులు షాకయ్యారు.సెల్వమణి ఈ కేసును సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో సెల్వమణి రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. అయితే ఏపీ మంత్రి, ప్రముఖ నటీమణి రోజా భర్త సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది.
పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. సెల్వమణి పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ కేసులో ముకుంద్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో అరెస్టయ్యారు. ముకుంద్ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారనేది ఆరోపణ. ఈ వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని ముకుంద్ కేసు దాఖలు చేశారు.
అప్పటి నుంచి విచారణ నడుస్తోంది. కొంత కాలానికి ముకుంద్ కన్నుమూయగా.. ఆయన కుమారుడు గగన్ కోర్టులో ఈ కేసు విచారణను కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాలేదు. అయితే గతంలో కూడా సెల్వమణి విచారణకు దూరంగా ఉన్నారు.. లాయర్లు కూడా కోర్టుకు రాలేదు. అప్పుడు కూడా చెన్నై జార్జిటౌన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్‌పై సెల్వమణి స్పందించాల్సి ఉంది.