మా అక్కను వాడుకొని వదిలేసాడు..! రాహుల్పై రతిక చెల్లెలు సంచలన కామెంట్స్.

బిగ్ బాస్‌ తెలుగు 7లో తన టాస్క్‌లతో పాటు అంద చందాలతో అదరగొడుతోంది రతిక. ఈ భామ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు రాలేదట. ఈమె బిగ్‌బాస్ హౌస్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాల్గో వారంలో రతిక ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె ఇంట్లో ఉండగానే తన మాజీ ప్రేమికుడు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దానిపై రాహుల్ కూడా స్పందించారు. తాజాగా ఆమె హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్బంగా రతికా చెల్లెలు ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె రాహుల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.. రతిక-రాహుల్‌ ల ప్రేమ వ్యవహారం నిజమే. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మా నాన్న, మా అక్కాబావతో కూడా మాట్లాడింది రతికా. కానీ.. పెళ్లి తరువాత రతికాను ఇండస్ట్రీ వైపు రాకూడదని చెప్పాడు రాహుల్. దాంతో ఇద్దరి మధ్య అభిప్రాయం బేధాలు వచ్చి అండర్‌స్టాండింగ్‌తోనే బ్రేకప్‌ అయ్యారు. కానీ అనూహ్యంగా రతికా బిగ్ బాస్ కు వెళ్ళాక ఇద్దరి ఫోటోలు బయటకు వచ్చాయి.

అవి ఎలా బయటకు వచ్చాయో మాకు అర్థం కాలేదు. రాహుల్‌ సైడ్‌ నుంచి లీక్‌ అయ్యాయని అనుకున్నాం. రతిక దగ్గర ఆ ఫొటోలు లేవు. ఓ ఆడపిల్ల ఎప్పటికీ తన గురించి తాను బ్యాడ్ గా స్ప్రెడ్‌ చేసుకోవాలనుకోదు. మళ్ళీ దాని గురించి స్టోరీ పెట్టాల్సిన అవసరం లేదు. రతికా రాహుల్‌ను ఎప్పుడూ యూజ్‌ చేసుకోవాలనుకోలేదు. ఇద్దరు బాగున్నప్పుడే యూజ్ చేసుకోలేదు.. బ్రేకప్‌ తర్వాత ఎందుకు చేస్తుంది చెప్పండి.. అంటూ చెప్పుకొచ్చింది ఆమె. మరి ఆమె రతికా చెల్లెలు చేసిన ఈ కామెంట్స్ పై రాహుల్ తరుపు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *