అందరి ముందు అంబటి రాంబాబు మైక్ లాక్కున్న RGV, అసలు ఏమైందంటే..?

వ్యూహం సినిమా విడుదల ఆపాలంటూ… టీడీపీ నేతలు హైదరాబాద్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు టీడీపీ నేతలు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలను పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని న్యాయస్థానానికి టీడీపీ నేతలు విన్నవించారు.

ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతుండగా… కోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *