నేడు హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డినే అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ కే సీఎం పదవిని కట్టబెట్టింది. పార్టీలో ఎంతో మంది సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ వారందరినీ కాదని రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది.
అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం ఏంటనీ మీకు సందేహం కలుగొచ్చు. అది నిజమే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ ను డైరెక్ట్ గా సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలను కైవసం చేసుకుంది హస్తం పార్టీ.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సీట్లను గెలుచుకుని నూతన గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే.